Sunday, July 25, 2021

యుగ సంధి తేది: 07-01-2021

 యుగ సంధి 

తేది: 07-01-2021 
శీర్షిక : మానవత్వపు ఛాయలు.... 
సంఖ్య:  588

పలు సంవత్సరాలుగా పగళ్లు రాత్రులు 
పరుగెత్తుతూనే ఉన్నాయి... 
ప్రతీ క్షణం గడచిన క్షణం కన్నా 
వేగంగా ఆలోచనాత్మకంగా 
అడుగులేస్తూ... చిన్న చిన్న 
మెరుగులు దిద్దుకుంటూ
స్పర్శా మాత్రపు సంధులు 
దాటుకుని పయనం కొనసాగిస్తున్నవి.... 

క్షణాలు గంటలుగా 
గంటలు రోజులుగా 
రోజులు నెలలుగా 
సంవత్సరాలుగా ... పెరిగి  పెరిగి
పెరిగిన దూరాలలో మార్పులు చూస్తే
అంచనాలకందని యుగాలే...

పచ్చి మాంసాలను తింటూ తిరిగి
పాదచారిగ బయలుదేరిన మనిషి
విచ్చలవిడితనం నుండి విశాల విశ్వంలో
విపంచిలా ఎగురుతన్న పరిణామమే ..... 

నూతనత్వంమంటూ ఏవి 
ఎంతగొప్పగ ఆవిష్కరించినా ....
మారిన కాలాలకనుగుణంగా 
మనిషెంత మారినా .....

వస్తు వ్యామోహ వాంఛల
భ్రమల తెరలు తొలగించుకుని 
మానవత్వపు ఛాయలే 
మనిషి పొదువుకోవాల్సింది.... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment