వెన్నెల తునక
తేది: 07-12-2020
సంఖ్య : 60
కలల పంటగా కన్న తల్లిగా
కాలు మోపే మాయింట
మా కళ్ళలోన మెరుపులు నింప
కమ్మని ఊహల మల్లె తీగై ....
బుచ్చి బుచ్చి మాటల బృందావనం
భువన మోహనమయ్యే వాణీమయం
బుడి బుడి అడుగుల నందనవనం
భువిన దిగిన మహాలక్ష్మి నివాసం .....
చిరు దరహాసాల చిద్విలాసం
మరువ లేము ఏ మరునిమిషం
ఆనందాలను పంచే అమృతం
మా ఇంటి నిలిచిన సిరి నందనం...
అడుగడుగున నింపేను
ఆనందాల మూటలను
ఆహ్లాదమాయే ఆ తీయని
మధురిమలు అనుక్షణం .....
పాలు మీగడల పసితనం
పరిమళించెను వెన్నెల చల్లదనం
పౌత్రీమ తల్లియై పావనం చేసే
ప్రతివారినీ మా ఇంట ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment