Sunday, July 25, 2021

అరుణిమ తేది: 04-12-2020

 అంశం: అరుణిమ 

తేది: 04-12-2020
సంఖ్య : 57

రంగుల్లో నిలిచిన ప్రాథమికం 
రాచ మర్యాదల్లో తానో  ప్రత్యేకం 
హంగు ఆర్భాటాలకు సంకేతం 
అరుణ తివాచీల స్వాగతం.... 

ఆదిశక్తి స్వరూపం 
అమ్మకు ప్రతిరూపం 
అందరిని పలుకరించు 
అంతర్గత తరింగిణిగా  ......

శౌర్యానికి ప్రతిరూపమై 
స్థానమందె అగ్ర భాగాన 
మువ్వన్నెల మన ధ్వజానా 
మురిపమై ఎద ఎదనా ...... 

రైతు రంగరించిన రుధిరం 
మానవాళి ఆకలి తీర్చే వైనం 
మసక బారుతున్న బంధం 
పేరుకేమో పెద్దరికపు చుట్టం .... 

పట్టువిడుపుల పదనిసలు
మెట్టు మెట్టున ప్రాశస్త్యమే
పట్టం కట్టి వదిలితే చాలదు 
ప్రత్యక్ష పరోక్షాల ప్రభావ శీలతలు
పరిగణించి సాగు జగతి ప్రగతికై... 

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment