Friday, July 23, 2021

ఆత్మలు వాలిన చెట్టు తేది: 02-12-2020 (శీర్షిక: ప్రేతాత్మల పెన్నిధులాయె... )

 ఆత్మలు వాలిన చెట్టు

తేది: 02-12-2020
శీర్షిక: ప్రేతాత్మల పెన్నిధులాయె... 
సంఖ్య:  575

తర తరాల వంశవృక్షం 
తారల్లో మెరిసిన అందం 
తండ్రి తాతలనాటి బంధం 
తళుకులీనిన అవిభాజ్యం .... 

ఏ నర దృష్టి సోకిందో
ఏం మాయ ఆవిరించిందో 
పాశ్చాత్యపు పాడు మోజులోపడి
పడగనీడలు ఆశ్రయిస్తున్నది....

సంస్కృతీ సాంప్రదాయాలు 
సన్నగిల్లి పోయి చిరునామా లేక 
కన్న వారిపైన  ప్రేమలు 
కలి మాయల కన్నీరు కార్చుచుండె ....

ఆత్మీయ బంధాలు కాస్త 
అటకెక్కి శ్వాస కోస యంత్రం పైన 
ఆర్ధిక బంధాలు మాత్రమే 
హల్ చల్ చేస్తున్నాయి....  

ఆత్మలు వాలిన చెట్లు కూడా 
ప్రేతాత్మల పెన్నిధులౌతున్నయి
బీడు భూమిలో విత్తిన 
మోడువారిన మొలకల్లా .... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment