నోటు
తేది: 02-12-2020
శీర్షిక: ఓటుకు బదులు
సంఖ్య : 56
చెంగున విసిరెదము చేమంతిలా
చెత్తంతా చేర్చి రోడ్ల మీద ఇష్ట రీతిగ
పక్కవాళ్లేస్తే మాత్రం పరుగున వెళ్లి
పంచాయితీ పెట్టి ప్రాణాలు తోడేస్తాం....
పెద్ద పెద్ద చెట్లను పెడనరికి
చిన్న చిన్న మొక్కలతో సేల్ఫీలు
తీసుకుని స్టేటస్ లు నింపుకుని
పెద్దమనుషుల్లా పోజులు కొట్టగలం ....
మనం పాటించినా లేదా
పర్యావరణం నిర్యాణం చేసి
పురాణాల పంచాంగాలన్నీ
సవివరంగా చర్చిస్తాము .........
వానొచ్చి వరదలొస్తే
లబోదిబో మంటాము
కనపడని దేవునికి మొక్కి
కనపడ్డ నాయకున్ని కడిగేస్తాము....
బాధ్యతగా ఓటు వేయమంటే
బదులుగా నోటు ఆశిస్తాము
బిగుతుగా తాగి తొంగుంటాము
బిగ్గరగా నాయకుల మీద అరుస్తాము.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment