Tuesday, May 21, 2024

నన్ను మాట్లాడనివ్వండి తేది :07-06-2023 శీర్షిక : రైతును ... మాట్లాడనివ్వండి ...

 నన్ను మాట్లాడనివ్వండి 

తేది :076-06-2023
శీర్షిక :  రైతును ... మాట్లాడనివ్వండి ... 
సహస్రాధికం   

మాటల్లో మహరాజును చేసి 
మట్టి సింహాసనం మీద కూర్చోబెట్టారు.... కానీ 
మళ్ళీ నామీద పేనుకు పెత్తనంలా  
ఎవరెవరికో హక్కుభుక్తలను పరోక్షంగా 
కట్టబెట్టి ...నోటికాడి బుక్కను లాక్కుంటున్నారు ... 

నా మనిషితనాన్ని ఎదురుగా పొగుడుతూనే 
నా మాటలకు వెనుక విలువనివ్వరు .... 
నా గొప్పతనాన్ని త్యాగాలను మననం 
చేసుకుంటూనే నా ఆలోచనలకూ 
రూపమివ్వరు . 

ఆరుగాలం మట్టితో మాట్లాడుతానని 
కీర్తిస్తారు.... శ్వాసిస్తానని స్థోత్రిస్తారు 
అయినా అధికారులు నాయకులు 
నా మనసు తెలుసుకుని మసులుకోరు .... 

విత్తనాలు చూసి మొత్తుకుంటున్నాను 
కల్తీలను కాసింత పట్టించుకోండని .... 
ఎరువుల ధరలు చూసి వెర్రివాన్నవుతున్నాను 
కొండెక్కి కూర్చుంటే కనికరించండని ... 

అకాలవర్షాలకు ఆగమైపోతున్నానంటే 
ఆదుకునే మహానుభావులేరి ? 
అగ్రనాయకులు గౌరవిస్తేనే ... 
అధికారులైనా .... ఆమ్ ఆధ్మీలయినా 
అనుసరించేది .... ఆదుకునేది .... 
 
భూసార పరీక్షల బువ్వ పెట్టండి ... 
సరైన సమయంలో సలహాల పందిరేసి 
పరిమళాలు విరజిమ్మండి. 
అవసరాల అప్పులిచ్చి పంటలమీది 
తీర్చుకోండి .... 

పండించిన పంటలకు దిక్కులేదు ... 
కల్లంలో ఆరబోసుకోవడానికి  కాసింత 
వెసులుబాటైన బహిరంగ వేదికలు... 
రక్షణకు సరైన గోదాములు ఏవి ? 

అందుకే అప్పుడప్పుడు నన్ను 
మాట్లాడనివ్వండి .... నా మంచి 
చెడులు చెప్పనివ్వండి .... 
మనిషిగా నన్ను గుర్తించండి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment