Tuesday, May 21, 2024

పదాలతో వచన పద్యం తేది: 07-06-2023

 పదాలతో వచన పద్యం 

తేది: 07-06-2023


1.  రామ  దోమ ప్రేమ మామ 

రామ భజనకై నేను చింత చేయుచుండ 
చాటునుండి దోమ పసికట్టి తరిమికొట్ట....  
దైవ ప్రేమ మనమున కొంత మారి పోయే  
చంద మామ వెలుగులు మబ్బు కమ్మినట్టు ....  

2. కలం , బలం , హలం, పొలం .... 

కవికులకు కలమే పరికరము 
భావముల బలము కుమ్మరించ 
రైతు హలమును  చేతబూని 
పొలము దున్నిన చందముగా .... 

3, సమంత , త్రిష , పూజ , నిత్య .... 

వీసమంత గంధం రంగరించె చెలులు  
వినుత కీర్తిగ త్రిష విస్మయం చెందె 
పూజ లోకి ఇది సరిపెట్టుడెలా యంటూ 
నిత్య పద్దతిని మీరలేక సంశయంబుతోడ ...  

4, 
చరణ , పవన, మహేశ , ప్రభాస

రామా వీడను నీ చరణములనంటూ 
పవనసుతుడు సవినయముగ నుడువగనే 
కాంచెనంత త్రిలోకసంచారి మహేశ అంశను 
మారుతి వర్ఛస్సున ప్రభాసమై వెలుగులీన .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment