నేతాజీ
భారతమ్మ ఒడిలోన బంగారు బొమ్మ
బలమంతా కూడ దీసుకునె...
బహు లెస్సగ దేశ దేశాలెల్ల తిరిగి
బానిస సంకెళ్లను వదిలిస్తానని
బెంగాలున జన్మించిన బాల సింగము....
ఆశావాదమో అతివాదమో ...
బోయవాన్ని నమ్మలేనన్న
బోసుగారు పట్టె కద...పోరు బాట
నిశ్చయంగ నమ్మి చేత తూటా ....
ఆజాద్ హింద్ ఫౌజంటూ
అత్యంత సుశిక్షితమైన భటుల
రక్షణ పటాలమును ఏర్పరిచి
నిటారుగా తలెత్తుకుని నిలిచె .....
జయంతులు మాత్రమే వెలుగులీని
జాగృతపరుచె మన జాతినీతడు
వర్దంతి లేని వరపుత్రుడాతడు
వాదముల మధ్య వడిగా ఇమడలేక.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment