కరుణ 585
నవరసాలు నాట్య మయూరాలే
దేనికదేసాటి...లేదు వాటిమధ్య పోటీ
మతమేదైనా మనిషిలో ప్రవహించె రసాలు
మానవత్వాన్ని మరిస్తే రసాభాసాలే ....
స్వార్థాలను సంకనెత్తుకున్న సరంగులు
యుగాలనాటి ధర్మ సూక్ష్మాల మూలాల
సంద్రపు తటాకాల త్రాగునీటి జలసిరులను
నిన్న మొన్న పిల్ల కాలువల్లో ప్రవహింపజేసి....
తన్మయత్వపు తలమునకలు
కొందరైతే ... నిర్వచనాలు మార్చి
నిలువునా నిర్వీర్యం చేసేవిధంగా
అడ్డదిడ్డపు అవకాశాలు అందిపుచ్చుకోవాలని...
అందులోనే అతిగా వాదిస్తూ
ఎదుటివారి బలహీనతలకు
ధరలు చెల్లించే షరాబులై
బార్టర్లుగా కొలువుదీరుతుంటే...
మంచిని గ్రహించిన గంధపు భ్రమలు
గ్రహణపు పీడల నీడలనే ఆశ్రయించి
మలినాలను మూటగట్టుకుంటుంటే ....
పదాల పైన శాశ్వత హక్కులు కాదు
పరుల మేలు కోరితేనే పదికాలాలు
మనగలుగును మన మానవాళి......
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment