Friday, November 5, 2021

చలి మంటలు తేది : 06-09-2021 శీర్షిక : భోగిమంటలు

 చలి మంటలు 

తేది : 06-09-2021
శీర్షిక : భోగిమంటలు ... 
కవిత సంఖ్య : 162

తొలకరితో అవని మాత 
మరకతమై శోభించినట్టు 
చైతన్యాలు  నింపుకుంటేనే 
నిత్య నూతనమయ్యేది ..... 

అప్పుడప్పుడు అలంకరించుకుంటేనే 
అది ఆఛ్చాదనమైనా ... గృహమైనా... 
అందాలొలికే  మనోల్లాస సుందరతలను 
మహిమాన్విత ప్రదర్శనలతో...మైమరిపించేది ......

అగ్గిరవ్వలే అడుగులజాడలు 
మానవుని నాగరికత నడకలలో ... 
అవి తోడుంటే ఎదురులేదిక 
ఎంతటి విజయాన్నైనా ముద్దాడ ...

అతి శీతలమని బిగుసుకుంటే 
అడుగులు  ముందుకేయలేవు ..... 
అనుకున్నది సాధించాలంటే 
చలి మంటలు తోడవ్వాల్సిందే ..... 

చలి కొరకైతే చలిమంటలు ... అవే 
చెడు నంతా కూకటి వేళ్ళతో 
చేర దీసి అగ్నికి ఆహుతి చేస్తే 
కాల మానంలో భోగిమంటలు ... 


నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment