నన్ను నడిపించే మాట
తేది: 30-09-2021
శీర్షిక: అమృతతుల్యమైన అమ్మ మాట.
కవిత సంఖ్య: 766
ఆత్మీయతల మూటల అమ్మల మాటలో
అనురాగాల ముల్లెల నాన్నల హావభావాలో
అనుబంధాల ముచ్చట్ల తోబుట్టువుల తీరో
అక్షర బద్దమైన గురుదేవుల వాక్కులో
అనుకరిస్తూనే అడుగులేస్తాము మనమంతా….
అన్నా వదినా అక్కా బావంటూ
అత్తా మామా బాబాయి పిన్ని అంటూ
బంధాల మల్లె తీగలల్లుకున్న పరిమళాలే
పల్లె పట్టున మధుర పుట్ట తేనెలోలె…..
నన్ను నడిపించే మాటేదని ఉన్నపళంగా
అడిగితే మాత్రం… పల్లె మూలాలున్న
నేను కూడా….
నలుగురి మేలు కోరమన్న అమృతతుల్యపు
అమ్మ మాటేనని ఢంకా భజాయిస్తా….
వృత్తిలో నడచిన నలుబదేండ్లు
ప్రవృత్తిలో అడుగులేస్తున్న పదేండ్లు
అమ్మ మాటే వేదవాక్కుగా…అదేబాట
ఆదర్శ మార్గమై నన్ను నడిపించే మాట ….
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment