చిత్ర కవిత
తేది 10-09-2021
శీర్షిక : మహానగరం వాన మాయ
కవిత సంఖ్య : 44+5
నగరములో వాన నడి సంద్రములో
నావలాగా తేలియాడే పరవశాలు ....
తుక్కు తుక్కు నీటి గుంతలు
దాటాలంటే తొక్కుడు బిల్లలాటలే .....
నాయకుల వాక్పటిమల వాగ్దానాలకు
ప్రతి వర్షఋతువులో ప్రజల
పడిగాపుల ఓపికలకు ఎడతెగని
అవినాభావ సంబంధ రుజువులు .....
పాదచారుల భరతనాట్యాలు
వాహనదారుల తప్పించు విన్యాసాలు
కుడి ఎడమల గజిబిజి గందరగోళాలు
అంటరాయుళ్ల అవలీలతలు ....
మహానగరముల వెలసిన మాయలన్నీ
చిత్తడి వానలు గుత్తగా తేల్చేసు ...
గుత్తేదార్ల గుణ శీలతల నాణ్యతలకు
ప్రభుత్వాధికారుల పద నియంత్రణలకు
పరమ విశిష్టమైన పరీక్షా విధానము .....
వరుసలలో వేచి ఉండే వాహనాల
ఎదురుచూపులు ... పాదచారులపై
వేగపు వాహనాలు చిమ్మించి చిత్రించే
మట్టినీట ముంచిన కుంచెల మనోరథ చిత్రాలు ....
మొత్తానికి అదొక అపురూపమైన
అనుభవైక సరస్సుల చిత్ర విచిత్రం .....
పల్లె నుండి పట్నం దాకా మొత్తంగా
అందుబాటులో ఉండే అద్వితీయ ఘట్టం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment