పంచ శీలములు
తేది : 18-10-2021
శీర్షిక : విశ్వ గురువు ....
కవిత సంఖ్య : 54+10
పుట్టుక తోనే పుణికి పుచ్చుకునె
ప్రతివారు అనాదిగా... అంతర్నిర్మిత
ఆవిష్కరాల పూదోట... అనన్యమైన
అమోఘమైన గొప్ప సూత్రం హైందవాన .....
తమైనా ... పరమైనా ...వ్యక్తిగతమైనా....
దేశమైనా ... దేశాలమధ్యయినా ...
సతత హరితంలా కోరుకునేది ...
అందరూ పచ్చగా క్షేమం కావాలని .....
మత్త గజమంటి మంది మార్బలం
ఉన్నా .... రాజసాల క్షమాగుణాల
వారసత్వాలు ....అకారణంగా కాలు
దువ్వని... కనికరాల తత్వానికి వారసులై ......
సమన్వయాల సత్తాలున్నా...
పిలవని పేరంటాలకు చుట్టంలా
వెళ్లకుండ..... పొరుగింటి పుల్లకూరల
రుచులకు అర్రులు చాపక పోవడం ......
మేము మీకెంతో .... మీరు మాకంతే ...
అంటూ ... పట్టింపులు పక్కన పెట్టి ...
చిన్నా పెద్దా భేషజాలు వదిలేసి
మనమంతా సమమేనన్న సద్భావనలు ....
స్వార్థాల సరంగులై చుట్టు ముట్టున్న
చిన్నా చితకలు ... అజ్ఞానంగానో
విజ్ఞానంగానో అక్కసులు వెళ్లగక్కుతూ ...
పక్కలో బల్లాలై నిత్యం పొడుస్తున్నా ...
శాంతి ప్రవచనాలనే సదా జపిస్తూ ....
సహజీవన సూత్రాలను విశ్వమంతా
బోధిస్తూ .... విశ్వ గురువాయే ఈనాడు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment