రాయబడని కావ్యాలు
తేది : 28-10-2021
శీర్షిక : మనీషి లోని మరో కోణం
కవిత సంఖ్య : 785
అనుక్షణం ప్రజల క్షేమాలను ఆశిస్తూ
అరువదేండ్లు పాలించిన అశోకునికన్నా
పదకోండేండ్లు పాలించిన అలెగ్జాండరునే
గొప్పగా చిత్రీకరించిన మీడియా గోత్రాలు...
రెక్కలు ముక్కలు చేసుకుని
రక్తాన్ని స్వేదంగా చిందించి
పునాది రాళ్ళలా ఎవరికీ కనపడని
కటిక దరిద్రతను దత్తత తీసుకున్నారా
అన్నట్టుండే .... కార్మిక లోకపు కష్టాలు...
నిఖారసయిన నిజాయితీల కష్టంతో
నింగినంటే రంగుల లోకాన్ని నిర్మించి
ఏమెరుగని నిరక్షరాస్యతలతో
మురికి వాడల్లో మూలిగే పేద బతుకులు .....
సదా ప్రజాక్షేమాలను శ్వాశిస్తూనే
సర్దుకునే ప్రజాపద్దుల నీడలలో
సరిపడని జమా ఖర్చుల తారతమ్యాల
ధవళ వస్త్ర సూత్రదారుల మనోగతాలు ......
చిన్న చిన్న విషయాలను చిలికి చిలికి
గాలి వాన చేసి ... చిక్కు ముడి తీయరాని విధంగా
చాప కింద నీరులా ప్రతీది ప్రజాస్వామ్యానికి
ముడివేస్తూ .. కృత్రిమ సంక్షోభాలను సృష్టించే
మహారాజుల అసలు రూపం .....
అబ్బో .... లక్కు కలిసి వస్తే లెక్కకు
మించి....మనీషి లోని మరో కోణం….
ఎన్నో…ఎన్నెన్నో…రాయబడని కావ్యాలు ….
మనిషి మనిషికి నీడలాంటి మరో చరిత్ర….
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment