Friday, November 5, 2021

జాషువా గారి జయంతి తేది 28:09:2020

 జాషువా గారి జయంతి

తేది 28:09:2020 
శీర్షిక: జయహో జాషువా

అంధకారమున అరవిరిసిన కమలము 
అమ్మ భాషలో పురి విప్పెను గళము 
అనన్యమైన అధ్బుత రచనలతో 
అంబరాన్ని చుంబించె అర్ధ శత వత్సరములు…

మసక చీకటి తాను అనుభవించినను
మణి వెన్నెల వెలుగులిచ్చె దివ్య రేడులా 
మాతృ భాషకు ఓ మైలు రాయిగా 
మలిచె జాషువాగారి  కవితా యుగం….

రవి గాంచని చోటు కవి గాంచునన్నట్టు 
రమ్యమైన ప్రకృతి ప్రాణ కోటిలో 
రచనా కోణమాయె గబ్బిలము సైతం 
రచయితల నెందరినో రక్తి కట్టించి నిలువగ…. 

నాస్తికతను  తాను  నమ్మి సమర్ధించినా 
వాస్తవాలను సవివరముగా ఆవిష్కరించారు
బూర్జువాలను కవిగా ఎదిరించినా 
సున్నితముగానే  సృషించారు సుందరమై…. 

పదనిసలై పారినవి వారి కవితా పల్లవులు 
పరమ శ్రేష్ఠునిగా అభినందించ బడ్డాడు 
పద్మ పురస్కారం తానుగా వరించినది 
పరమ పూజ్యుని చరితకు నేను సైతం 
జాషువా గారి జయంతికి జయహో 💐🙏 

నగునూరి రాజన్న
కరినగరము.

No comments:

Post a Comment