Friday, November 5, 2021

విశ్వజీవన రాగాలు తేదీ : 23-09-2021 శీర్షిక : జీవన తంత్రులు

 విశ్వజీవన రాగాలు

తేదీ : 23-09-2021
శీర్షిక : జీవన తంత్రులు 
కవిత సంఖ్య : 760

కాలానుగుణంగా మానవుడు 
కాంతివంతమవుతూ  వచ్చాడు .... 
కొండ చరియల బ్రతుకుల నుండి 
దండి జీవన గతులననుభవిస్తూ .... 

ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ ... 
విహంగాలలో పయనిస్తూ ..... 
విశ్వమంతా చుట్టి రావడమే కాదు ... 
ఏకంగా గ్రహాంతరాలకు పయనమాయె .....  

కాల మార్పుల్లో కావలిసిన  సంకేత 
కూర్పులేర్పరుచుకుని నిలిచినంత 
మాత్రాన ... గతించిన పూర్వీకులు 
మదించుకున్న కుల గోత్రాలలో 
తప్పులు వెదుక్కోవడం మానేసి ..... 

ఆడలేక మద్దెల ఓడులా ... పొద్దు 
పుచ్చడం మానుకుని ..... అడ్డులేని 
ఆధిక్యతలు నిరూపించుకుని రాకెట్టులా 
దూసుకెళ్తే మాత్రం  .... కాదనే వారెవరు ... 

ఎంత ఎదిగినా మూలాలు మరవకుంటే 
చాలు ...రూపమిచ్చిన కన్న తల్లి దండ్రులను ... 
కాయం పెంచి పోషించిన మాతృ భూమిని ....  
కళ్ళల్లో పెట్టుకుని చూస్తే చాలదా .... 
అవే కదా విశ్వ మానవ జీవన తంత్రులు 
విశ్వ జీవన రాగాలు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment