Thursday, October 21, 2021

నీ మాట తేదీ : 06-09-2021 శీర్షిక : నా కల

 నీ మాట

తేదీ : 06-09-2021
శీర్షిక : నా కల 
కవిత సంఖ్య : 44+3

ఆటపాటల ఆనందాల బాల్యాలను 
బలవంతంగా సాంకేతికతలు 
భళ్ళున లాగేసుకుంటుంటే ...స్వీయ 
నియంత్రణ శిక్షణలతో చిన్నగ 
సాధన చేయాలి తల్లితండ్రులే ...... 

ఉరుకుల పరుగుల జీవితాలకు 
ఉడకేసుకుని తినే తీరికలు లేక 
ఊసురోమంటూ...  ఊరుమీద పడి 
ఉన్నదేదో తినకుండా .... స్వీయ 
నియంత్రణలు పాటించాలి ... 

ఐదంకెల జీతాలంటూ అర్రులు 
చాచి అస్తమానం గణన యంత్రాల 
స్వాధీనం అయినవారు ... అప్పుడప్పుడు 
అయినవారి తీరని బాధలను కూడా 
ఎడబాపే ఆలోచనలు చేయాలి .... 

సాఫ్ట్ వేరులే సర్వస్వం అనకుండా
సంఘం శరణం గచ్చామి అంటూ  
యువత సంఘం.... పాలనలు ... 
దేశం... వైపు కూడా అడుగులేసే దిశగా 
తర్ఫీదులనివ్వాలి .... 

పాలకులైన .... ప్రతిపక్షమైనా ... 
ప్రజలే దైవం....దేశమే పరమోన్నతంగా...
పాలనలోక ఉదాహరణాలై ... ముందు 
తరాలకు మార్గదర్శకమవ్వాలి ... 
అందుకు సరిపడా చట్టాలను అమలు 
చేయాలి.... 

కల్తీలు లేని కలల సామ్రాజ్యం .... 
కాలుష్యమెరుగని కమ్మని ప్రకృతి ... 
కల్మషాలు లేని ప్రజా జీవనం .... 
కలుషితాలు కాని  పాలనలు ..... 
కంటకం కాని అధికార యంత్రాంగం ... 
కర్మను నమ్ముకున్న సైనిక దళం 
నా కల .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

1 comment:

  1. బాగుంది సర్... వెగ్గలం ఉషఃశ్రీ

    ReplyDelete