మట్టిలో కలిసేదాకా
తేది: 24-10-2021
శీర్షిక : అమ్మతనం
కవిత సంఖ్య : 182
పంచభూతాలతో పదిలమైన
జీవరాశియని ... పట్టినా ముట్టి నా
పబ్బతి పట్టే ఆనవాయితీలతో
పవిత్రమైన ఆచారాలు మన హైందవాన ....
అమ్మ గర్భంలో నిలిచిన రూపం
అపురూప మృణ్మయమే శిల్పం
విరించి ఊహల విచిత్ర ప్రాణం
అసువులు పోసుకున్న ఆనంద క్షణం...
అవనిపైన చేరుకున్నా గాని
కొండా కోనా తరువులిచ్చే చల్లని
గాలులే ఉఛ్వ్వాసా నిచ్వ్వాసాలకు
ఊపిరులూది నిలిపేది ....
సెలయేళ్ళ స్వచ్ఛ నీరే దప్పిక తీర్చి
ప్రాణం నిలిపేది ....అనుక్షణం శరీర
పోషణలకు అమ్మ భూమాతే మనను
వెన్నంటేది... ఆహారాలందిస్తూ సదా
కనిపెట్టుక నిలిచి కడుపులో పెట్టుకునేది ......
జన్మనిచ్చి పెంచిన అమృతమూర్తి అమ్మ సైతం
వదిలి వెళ్తుంది కొంతకాలానికి దూరం .....
తనువున్నంత సేపు మోస్తుంది ఈ అమ్మ భారం
తదుపరి కూడా చేరదీస్తుంది ఖనన రూపం....
అయినా గుర్తెరుగరు ఈ మానవ లోకం
అన్నింటా ప్రదర్శిస్తారు కలుషితాల రాక్ షసం
అన్ని సహిస్తూ నిలుస్తుంది అమ్మతనంతో ....
ఆఖరుకు గుర్తించక అవుతారేమో తమంత తామే భస్మం...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment