అక్షర వెలుగులో
తేదీ : 08-09-2021
శీర్షిక : ఆదిత్యం
కవిత సంఖ్య : 748
అక్షరం ఆదిత్యమై వెలుగులు
విరజిమ్మితే ... మహిమాన్వితుడై
మనిషి శశి వెన్నెలలనే కురిపించు ....
మరికొన్ని జ్యోతులు వెలిగించే
మహోపకారై వెలుగులు పంచు ...
చీకటి గుహల్లో చిక్కుకున్న
అనాగరిక జీవితాలకు వెలుగులద్ది
నిత్య జీవనయానపు విలువలద్దు ...
నరేంద్రుడు వివేకానందుడౌతాడు
విశ్వ వీధి గగనాన యుగ పురుషులౌతారు
చీకటిలో మగ్గాల్సిన బ్రతుకులకు
చిత్రంగా రాజ్యాంగములో స్థానం
అందిస్తారు....
రామేశ్వర వీధుల బాల్యం
రాజధాని వినువీధులలో
రాజరికపు ఉన్నత సౌధములో
శాల్యూట్ లు తీసుకొంటుంది ...
గుడ్లగూబల జీవిత శాపాలనొదిలి
వసంత కోకిలలై కమ్మని రాగాలతో
గాన గంధర్వాలు చేయొచ్చు .....
గొప్పోళ్ళుగా కీర్తులు గడించవచ్చు
కానీ ఎందుకో ... మహత్యాలు
మహిమాన్వితాలు తెలిసినా
ఇంకా కొంత మంది అక్షరాలను
అల్లుకుని అలుముకున్నా
స్వార్థాలను సంకనేసుకుని
రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment