నా మనసే ...
తేది : 20-10-2021
శీర్షిక : జ్ఞాపకాల భరిణె
కవిత సంఖ్య : 54+11
బంగారు క్షణాల బాల్యపు గుర్తుల దగ్గర
నుండి .... బాధ్యతలెరిగిన జీవిత
గమనాలలో ... ప్రతి మలుపులో
ఎత్తు పల్లాలను ఏకరువు పెట్టింది
ఆనంద విషాదాలను అల్లుకున్నది ...
కష్టాలను కషాయంలా కాచి వడ
బోసి...సుఖాలను సునాయాసంగా
గ్రోలి...మధురానుభూతులను మూటగట్టి ...
అపురూపంగా అప్పుడప్పుడు మురిపిస్తుంది ....
అమ్మానాన్నల ఆశీర్వచనాలతో
చదువుల తల్లిని వేడుకొని ప్రార్థించ..
కరుణించి దీవించి ... సంఘములో
నిలబెట్టి బతుకు చుక్కాని అయింది ....
ఓ ఇంటి వాన్నయిన దగ్గరనుండి
కొమ్మలు రెమ్మలై పూవులు కాయలతో
పురుడుపోసుకున్న పుణ్య కాలాలను
పూవులు వెల్లివిరిసి చదువులతల్లి
ఒడిలో మెరిసిన ఆనంద క్షణాలను…
అల్లరి చేసి నిలిచిన ఆకుచాటు పిందెలు
అంచెలంచెలుగా అభివృద్ది చెంది
ఏడడడుగులు వేసిన శుభతరుణాలను…
విడిచి దూరంగా వెళ్ళిన భారమైన
ఘడియలన్నీ బహు చక్కగా నిక్షిప్తం …..
తీగలు లతలై పూలై పౌత్రమసంతోషాలు
ఫరిడవిల్లగా జ్ఞాపకాల భరిణె నిండిపోయే....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment