సాగుదల
తేది : 21-09-2021
శీర్షిక : మాటలలో మహారాజు
కవిత సంఖ్య : 167
ఆరుగాలం ఆకాశమే గూడు
అహర్నిశలు అవని భూమాతే
ఆతని చేతుల్లో చెండులా ఆట
మట్టి వాసన ముట్టనిదే ముద్ద దిగదు .....
కనులు మూసినా కాంచ గలడు
మనసు పెట్టి మాట కలపగలడు
మౌన భాషను కూడా పసికట్టగలడు
స్పర్శించి భూమాతతో పరవశించగలడు .....
పాల కంకుల మనసున్న రైతన్నకు
విత్తనాల దగ్గరనుండి విత్తులింటికి
చేరేవరకు ...పల్లె బాటాన్ని కష్టాలు ...
ఎప్పుడూ సాలెగూటిలా చుట్టుముట్ టే కష్టాలే ...
అతివృష్టి ... అనావృష్టిల కోపతాపాలను
దాటుకుని… క్రిమి కీటకాల బెడదలనుండి
విముక్తి పొంది .... గాలి వానలను ఎదుర్కొని
గట్టున పడినా….
గద్దల్లాంటి దళారుల చేతిలో పడి
గిజగిజ లాడుతున్నాడు……..
పట్టింపులేని పాలకుల చేతిలో పాచిక
అయిపోయి నలిగి పోతున్నాడు…..
మాటలతో మహారాజు పట్టాభిషేకమయినా
మద్దతు ధరల విషయంలో మిధ్యల ఊహలతో
కాలం వెల్లబుచ్చుతూ….మంచి రోజులకొరకు
కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నడు.
కష్టాలన్నీ కట్టగట్టుకొచ్చి యుద్దం ప్రకటించినా
అప్పులెన్నో చేసి నిప్పుల కుంపటినైనా
ఎక్కగలడు ... సాగుదల చేయనిదే
కాలు చెయ్యాడదు...కంటి మీద కునుకు రాదు ..
కలవరింతలతో కడుపుకింత తినలేడు ....
క్షణమైనా నిలకడగా నిలవలేడు ...
కాళ్లారా చాపి నిండుగా నిద్రపోలేడు ....
రైతన్నల పేరు చెప్పి రాజ్యాసనాలు
ఎక్కిన మహారాజులెందరో ....మరుక్షణం
అంతా మరిచి పోతారు... మళ్ళీ అక్కరకు
మాత్రమే మాటల్లో మహారాజును చేస్తారు ...
రైతన్న గోడు ఎవరికీ పట్టకపోయినా
దేశానికి ప్రజలకు కడుపులు నింపాలని
పలు విధాలా ప్రయాసలు పడుతూ లేస్తూ
అనుక్షణం తాపత్రయాల ఆస్తులే రైతన్నకు.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment