నాగుల చవితి
తేదీ: 08-11-2021
శీర్షిక : సుమ పరిమళాలు …
కవిత సంఖ్య : 69+3
విశ్వమంతా వింతలమయమే ....
అవనంతా ఆనందములే
అణువణువున అనంతున్ని
చూసే తత్వమే భారతీయం .....
ఆచార సంప్రదాయములన్నీ
ఆధార భూతములే... సశాస్త్రీయ
సంఘటనలే ....సనాతన హైందవ
సంస్కృతీ సద్భావనల తోరణం ....
ప్రకృతితో మమేకమైన మానవుడు
చెట్టూ పుట్టా గుట్టా ... పాము తేలు
తాబేలు ..... ఏదైనా పూజనీయమే
పురాణేతిహాసాల పుణ్యప్రదం .....
వల్మీకమంటి మానవ దేహానికి
వరసైనదే వెన్నుపాము ....
కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలకు కేంద్రం .....
హరికేమో శేషతల్పమై
హరునికి కంఠ హారమైన
కాల సర్పములకు పూజలు
కార్తీక శుద్ధ చవితి కాముక ...
సంస్కృతీ పూదోటలో
సంపంగి సుమ పరిమళాలే
సన్నుతించి మనమంతా
ముందు తరానికి వారధులమైతే ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment