Friday, November 5, 2021

కాలి నడక తేది: 26-09-2021 శీర్షిక : అడుగుల బంధం

 కాలి నడక 

తేది: 26-09-2021
శీర్షిక : అడుగుల బంధం 
కవిత సంఖ్య : 169

చీకటి గుహల చింతల బతుకులకు  
కోటి వెలుగుల కాంతి నింపింది కాలి నడకే... 
నిటారుగా కాళ్ళపై నిలబడగలగడమే 
మనిషి నాగరికతకు మహా నాంది ... 

నాడు కాశీ యాత్రకయినా కాలి నడకలే 
రవాణ సాధనాల సందర్శనంకన్నా ముందు 
అత్యవసరాలకే కాదు..అవసరాలకు కూడా 
కాలి నడకలే కాముక చేసేవారు మనుషులు ....  

చక్రం పనిముట్లు చల్లగా చేరగానే 
నాగరికతలు నడకలు నేర్చినవి .... 
పారిశ్రామికీకరణలతో పరుగులు పెట్టగానే... 
ఎదో ఒక్క వాహనంగా ఎదురొచ్చి నిలిచాయి ..... 

సాంకేతికల సంధికాలంలో అసలు 
మనిషి నడకకే ఎసరొచ్చింది ....భూమి 
గుండ్రమన్నంత సత్యమైనది ..... 
కాలు కదలకుండానే పనులన్నీ 
ఆన్లైన్లోనే  అందలాలు అందుకుంటుంటే....  

నడక నాలుగు రకాల మేలు మనిషికి 
ఆరోగ్యం అనుభవం ఆత్మస్థైర్యం 
కాలుష్య రక్షణ.....  
కాలి నడకలే మలి దశ కొత్త శోధనలకు 
కూడా కొంత మూల కారణమయ్యింది .... 

ఉదయపు పూతోటలో ... వీనుల విందైన 
విహంగాల కువ కువల సంగీతంలో.... 
బాలారుణుడి లేత కిరణాల స్నానాలు చేస్తూ ....
సమృద్ధమైన ప్రాణవాయవులను ఆఘ్రాణిస్తూ ... . 
ఆడుతూ ... పాడుతూ ... అడుగులేస్తే .... 
ఆ ఆనందాలే ఆనందాలు అనన్యం అమోఘం ..... 

సాయంత్రమైనా సుందర సరాగాలే 
ఆనందమైన ఆరోగ్యానికి ఆహ్వానం 
పలుకుతాయి .... అడుగుల బంధం 
కాలి నడకలో కనిపించు కమనీయతలు ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment