తెలిస్తే ఏం చెయ్యగలం ?!
తేది : 18-10-2021
శీర్షిక : ఉడతాభక్తిగా .....
కవిత సంఖ్య : 179
రాజుల రోజులు పోయి
రాజ్యాలు మారినప్పటికీ
రాజకీయం రణతంత్రం
రాజుకుంటూనే ఉన్నది
దెబ్బ దేండ్ల స్వాతంత్రంలో
అవలోకనం అయ్యింది ఒక్కటే
పేదోడి పేరు చెప్పి పెత్తనాన్ని
మాత్రమే పంచుకుంటున్నారు
రెక్కాడితే కాని డొక్కాడని
పేదోడి బతుకు చిత్రం మారలేదు
రాళ్ళు రప్పలు మోసే
కూలోడి తలరాత మారలేదు
కాలానుగుణంగా పక్షులు
ప్రదేశాలు మారినట్టు
కండువాలు మార్చుకుని పార్టీలు
మారుతున్నరు మన నాయకులు ....
పదవుల పంపకాలలో
పరవశించి పోతున్నారు
హీనాతి హీనముగా ప్రవర్తిస్తూ
కంపరం పుట్టిస్తున్నారు .
ప్రజా ధనాన్నిలజ్జవీడి పసిగట్టి
పదిలపరచు కుంటున్నారు కొంతమంది ....
పచ్చి బజారు మనుషుల్లా నాయకులు ,
అధికారులు ,బడా వ్యాపారులు .
మనిషి "మనీ"షి గా మారి సాటి
మనిషిని దోచుకుంటున్నాడు
మనిషన్నవాడు మాయమై
విష జ్వాలలను విరజిమ్ముతున్నాడు.
"మనీ"షి-మనిషిగా మారకుంటే
మన మనుగడే మృగ్యమౌను
"మనీ"షి- మృగమై సంచరించక
ముందే మనమంతా మేల్కొనాలి...
మేల్కొల్పాలి ....
అక్షరాస్యత అభివృద్ధి జరిగితే
అంతమౌను కొంతైనా ఈ దోపిడీ...
సహాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు
విద్య ... వైద్యం అందకుండా అందరికి ....
సంఘ హితం కోరే సంస్కర్తలంతా-
ప్రశ్నిస్తూనే ఉండాలి ప్రభుత్వాలను...
పదిల పరచడానికి ప్రజాతంత్ర
ప్రజా స్వామ్యాలను ప్రజా క్షేమాలను
పదికాలాలు పటుతరముగా .....
ఊరుకోకుండా ... ఉడతాభక్తిగా.....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment