చెప్పాలని ఉంది
తేది : 27-10-2021
శీర్షిక : గట్టిగా ఒక్కసారి
కవిత సంఖ్య : 784
అమ్మ పెంపకాల గుణశీలతలో
నలుబదేండ్లు మాతృ సంస్థలో
పొందిన అనుభవాల అడుగుజాడలో
మానసిక అనుభూతుల యుక్తాలో ....
కంటికి కనపడని సూక్ష్మ క్రిములు
కబాడీ ఆడిస్తుంటే .... పొరుగు క్షేమాలు
పొందుగా కోరాలని ... కాముక మాస్క్ లు
ధరించండని దండోరాలు వేసినా ... .
దారికి రాని యువతకు చెప్పాలని ఉంది ....
ప్రజాస్వామ్యాల ఊరు పేరు చెప్పి
పబ్బం గడుపుతున్న ధవళ వస్త్రాల
మాటున దాగున్న దమన నీతులకు ...
గొంతెత్తి అడుగడుగునా అడ్డు చెప్పాలని .....
అధికార పక్షం అండదండలో .... లేక
అలవాటు చేసుకున్న అహంకార పొరలో ...
అదేపనిగా అవినీతి గంగలో స్నానమాడుతున్న
అధికార గణాలకు గట్టిగా బుద్ది చెప్పాలని ఉంది....
ఆటలలో మెరుపులకన్నా ... పాటలలో
పట్టు సాధించడం కన్నా.... ఆరుగాలం
కష్టపడి అరకదున్నీ రక్తాన్ని స్వేదంగా మార్చి
అన్నపూర్ణగా వండి వడ్డించే రైతన్న ....
కంటినిండా మనమంతా కావాల్సినంత ప్రశాంతగా
నిదురపోవడానికి కారణమయి ... అహర్నిశలు
కంటిమీద కునుకు లేకుండా శతృమూకల
దునుమాడే సిపాయే మిన్నని ... గట్టిగా కేకపెట్టి
ఒక్కసారి చెప్పాలని ఉంది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment