సామాజిక సేవ
తేది : -21-09-2021
కవిత సంఖ్య : 44+7
తనువు స్వార్థాలకు చోటివ్వక
తరువులా సదా పరులమేలు
కోరుతూ తనువున్నంతవరకు
తండ్లాడే మనస్తత్వాలకు మారుపేరు ....
కొమ్మ రెమ్మయిన తోబుట్టువులో కాకున్నను
కోరిన బంధువు తరువు పీచులో లేకున్నను
కుల గోత్రాల కుత్చితాల పిచ్చి లేకుండాను
రంగు రుచి వాసనల రమ్యతలు లోపించినను…
అత్యంత సాధారణ సంఘ సభ్యులను కూడా
" నా " అనుకునేంత ఆత్మీయతలు చాటునది….
ఉత్తరాల జాడలలో ఉసురు తీయకుండా
దక్షిణల పేరుతో దండిగ శిక్షించకుండా
స్థిత ప్రజ్ఞతల చిత్తములు బూని ఎవరి కొరకైనా
చింతలు లేని అడుగులు చిత్తశుద్దితో
వేయగలగడమే....
ఆపదులను ఆదరించే గుణ సంపన్నత
అంగ వైకల్యాలను అక్కున చేర్చుకుని
అభాగ్యులను ఆపేక్షతో చేరదీయగలిగేది
నిరాశ్రయులను నిశ్చింత చేయగలిగేది ....
ఆకలిగొన్నవారికి అన్న పెట్టడం
పీడితులకు న్యాయమందించడం ...
రోగులకు వైద్య సహాయమందించడం ...
గందరగోళములో గమ్యం చూపడం ....
ఒక్కమాటలో చెప్పాలంటే ...
అహానికి తిలోదకాలిచ్చి
అందరిని సమంగా చూడగలిగేది
అందరికి సమ ధర్మం ...సమన్యాయాలకు ...
బీజమేసుకుని ప్రయత్నించడమే......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment