Friday, November 5, 2021

చిత్ర కవిత 24-09-2021 పట్టుదల కవిత సంఖ్య: 44+9 ( a lady was carrying water drums in her rikshaw )

 పట్టుదల

కవిత సంఖ్య: 44+9

పంటి బిగువున పట్టి తొక్కె పడతి
పయ్యలు మూడమరిన సైకిలును
పని దొరకక… పస్తులుంచలేక పట్టుదలగ
పసి పిల్లల కడుపులు నింపడానికై….. 

పట్టి తెచ్చిరి నీటిని పంచడానికై…
ప్రజల పట్ల బాధ్యతలు మరచిన 
ప్రభుతల పనితనం..వింత చేష్టలు 
గొలుప..వెట్టి చాకిరిలా..వెక్కిరించగ… 

పాలకుల పాచికలలో బందీ అయిన
ప్రభత్వ  సారాయి  దుకాణం లోన మునిగి 
తేలుతూ మురిసిపోతూ… పెళ్ళాం పిల్లలను 
మరచిన పోరంబోకు పతి జాడ గతి లేక…. 

ఉచితాలంటూ ఊదరగొట్టి పైసలు 
పంచి పజీతాలు పెంచి పోషించే 
కపట బాజీ కాలనాగులు..కష్టాలు 
బాపే మార్గములు చూడరెందుకో … 
కడగండ్లను బాపే మార్గమెంచుకోరెందుకో…. 

మరొక్కసారి మనందరం వేడుకుందాం 
మంచి బుద్దిని ఎంచి ఇమ్మని
మన పాలకులకు… ప్రజలయెడ
రామ రాజ్యమై విలసిల్లు విధమున… 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment