Friday, November 5, 2021

నా వాదం తేది: 05-10-2021 శీర్షిక : జాతీయ వాదం ...

 నా వాదం

తేది: 05-10-2021
శీర్షిక : జాతీయ వాదం ... 
కవిత సంఖ్య : 770

ఆత్మీయతలు పంచిన 
అమ్మానాన్నల పెంపకం 
అనుబంధాలు  పోషించిన 
తోబుట్టువుల పర్వం .... 
అనురాగాల మంత్రంతో 
మెరిసిన మిత్ర బృందం ..... 
అన్నీ కలిస్తేనే వ్యక్తిత్వం .... 

పుట్టుక చావులు మనవైనా 
బతుకంతా సంఘానిదే 
అన్నాడో మహా కవి ..... 
ఇంటివరకు వ్యక్తిత్వం 
అయినా .... 
సంఘంలో కొస్తే సమైక్యం 
కావాల్సిందే ...... 

నా వాదం మింగుడు పడదేమో 
కొందరికి .... 
అలుపు సొలుపూ లేకుండా 
కోలుపంతా ఉన్నది ఉన్నట్టుగా 
మాట్లాడేస్తూంటా ...... 

నా వాదం విసుగొస్తుందేమో 
కొందరికి ..... 
స్వలాభాపేక్షలు లేకుండా 
నిఖార్సుగా మాట్లాడి 
నిలువరిస్తుంటాను ...... 

నావాదం వెంటనే అందరు 
మెచ్చకపోయినా ... 
మొదట నలుగురికి.....  
మెల్ల మెల్లగా అందరికి 
నచ్చి తీరుతుంది ....... 

ఏది ఏమైనా ....ఎవరు 
మెచ్చుకున్నా ... మెచ్చక 
పోయినా......దేశ సరిహద్దుల్లో 
కాపలా కాస్తుంది .... జండాను 
మోస్తుంది .... జాతీయ వాదాన్ని 
శ్వాశిస్తుంది ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment