స్వాగత సుమాలు
తేది : 23-10-2021
శీర్షిక : నూతన తరం
కవిత సంఖ్య : 181
చుక్కల్లో చంద్రునిలా... లెక్కలేనంత
మందిలో చక్కంగా నిలబడి
అలుపులన్నీ తీరే విధంగా
అందుకున్నానోక ఉద్యోగం ...
స్వయంపోషిత విధానాన
స్వంత కాళ్లపై నిలిచానని
కొంత ఊరట చెందిన అమ్మానాన్నలు
అందిచారొక సహచరి హస్తాన్ని .....
అనుబంధాల పందిరిలో
అల్లుకున్న బంధాలకు
ఆశీర్వదించిన పరంధాముడు
అందించాడొక అపురూప కానుక ....
కళ్ళు కాయలు కాయకుండానే
కళ్ళల్లో కాంతులు నింపుకుని
కడివెడు ఆనందాలను వెదజల్లుతూ
కంటి పాపను అందించిందొక బహుమానంగా
నా సహచరి ....
నూతన తరానికి స్వాగతమంటూ
సంతోషాలను పంచుకున్నారు
అమ్మానాన్నలు అత్తమామలు
మా ఇరువురికి సుమమాలలనందిస్తూ .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment