Friday, November 5, 2021

జీవిత చక్రం తేది: 05-10-2021 శీర్షిక : బతుకు పుస్తకం

 జీవిత చక్రం

తేది: 05-10-2021
శీర్షిక : బతుకు పుస్తకం 
కవిత సంఖ్య : 54+3

పుట్టుక పూర్వోత్తరాలు 
మనకు తెలియవు ... 
ముగింపు మదనాలు కూడా 
మనకు తెలియవు .... 

బుద్దెరిగిన నుండే  
బుద్బుదప్రాయమైన గడిచిన 
జీవితం మాత్రమే తెలుసు .... 
మరుక్షణం గురించి 
మనమేమి చెప్పలేము ...... 

అరిచి మందలించిన 
అమ్మానాన్నలు ..... 
అలక బూనిన తోబుట్టువులు 
పోరి కొట్లాడుకున్న మైత్రీ బంధాలు ...
  
ఆడిపాడుకున్న అరుగులు 
కోతి కొమ్మచ్చి ఆటపాటల 
చెట్లు పుట్టలు ...గెంతి దొర్లిన 
ఆటమైదానాలు .... 
ఈదులాడిన చెరువులు బావులు 

బాల్యంలోకి తొంగి చూచి 
భద్రంగా దాచుకున్న పేజీలు 
భవితకు భరోసాలనిచ్చే 
బతుకు పుస్తకం ....... 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment