దసరా
తేది: 15-10-2021
శీర్షిక : పుణ్య పర్వం ...
కవిత సంఖ్య : 176
ఆచార సంప్రదాయాల అఖండ గని
యుగయుగాల చరితల ఆనవాళ్లు
భిన్నత్వంలో ఏకత్వం చూపించు
ఉన్నతమైన సంస్కృతుల మేళవింపు ....
వరములు బడసిన మహిషాసురునిపై
త్రిమూర్తుల అంశ నింపుకున్న దుర్గాదేవి
ఆశ్వియుజ శుద్ధ పాడ్యమి నుండి
ప్రారంభమై నవమి వరకు యుద్ధం
చేసి విజయం పొందిన దశమి ........
ఆనందాలు నింపిన ఆ పుణ్య క్షణాలు
శరన్నవరాత్రుల్లో శక్తి పూజలు చేసి
అమ్మను కొలిచే పౌరుషాల స్మరణం
భరోసాలు నింపుకున్న బతుకుబాటలు ...
భిన్న ప్రాంతాల్లో విభిన్న రీతులు ....
దేశంలోనే వైవిధ్యం మన తెలంగాణీయం ...
రంగు రంగుల పూలతో రమణీయంగా
శ్రీ చక్రం పోలిన బతుకమ్మగా పూజలు .....
పాండవుల అఙ్ఞాతవాసాంతం
శ్రీరాముని ప్రియసఖి దర్శనం
పూర్వీకుల గౌరవ మననం దశమి
పుణ్య పర్వమై వెలుగులు పంచె
హైందవుల జీవనాన ...... దసరా
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment