ఆలోచించినా అర్థం కానిది
తేది : 14-09-2021
శీర్షిక : రాజకీయం
సంఖ్య : 44+6
ధవళ వస్త్రాల ట్రంకు పెట్టెలలో
దాగుడుమూతల దస్త్రాలలో
దాగున్న తల గొలుసు రాతల
దండి విధి విధానాలు.....
దేశీయ సంప్రదాయమంటున్న
కండువాల రంగుల్లో అల్లుకున్నా ...
కప్పుకు పోయి...
కనపడీ కనపడని ....
అడ్డ నిలువు దారాల్లా ... వినపడీ
వినపడని... అవగతమవని ఆలోచనల
విధానాల లాగ ......
రాజసాలు వెలగబెట్టే ప్రజా
తంత్ర పాలనల కిరీటాలయిన .....
ఖద్దరు టోపీలకింద నలిగిన
కేశాలు నల్లవో ... తెల్లవో....
జులపాలో.... వంకీలవో .....
రంగులద్దుకున్నవో....దిద్దుకున్ నవో .....
పట్టు విడుపుల్లో పట్టు సాధించినోళ్లు
మాటలకు ... చేతలకు... అసలు
పొంతన లేనోళ్ళు..... ఊసరవెల్లీలకన్నా
వేంగంగా రంగులు మార్చేతత్వం ...
విలువల వలువలను సునాయాసంగా
విసర్జించే గుణశీలత ....
ఎన్నికల పత్రాలలో "ఎన్నో కళలను "
పొందుపరిచి .... ఏ కలను తీర్చకుండానే
ఇంద్ర ధనస్సులోని రంగు చిత్రాలను
దర్షింప చేస్తూ ... కాల యాపనలు చేయగల
కళా క్షేత్రజ్ఞులు ....
ప్రజల మనోగతాలను పాతరేసి ....
స్వార్థ తెరలను అడ్డుపెట్టుకుని
జాణతనములను ప్రదర్శించే
బహిరంగ రస హృదయులు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment