Friday, November 5, 2021

నీకేం తెలుసని !? తేది: 04-10-2021 శీర్షిక : మరి వారికేం తెలుసో.....

 నీకేం తెలుసని !?

తేది: 04-10-2021
శీర్షిక :  మరి వారికేం తెలుసో..... 
సంఖ్య : 769

కళ్ళతో చూసావాంటూ 
కబోదిలా ప్రశ్నల వర్షం .... 
నీకేం తెలుసని ? నిలదీతతల  
పర్వం ..... 

కాలు కదిపేది లేదు ... 
సరైన మార్గంలో కష్టపడేది లేదు 
నమ్మకం అంతకంటే లేదు ... 
ముందస్తుగానే నిర్ణయాలకు 
వచ్చేయడం ....అన్నీ అడ్డుగోడలే ... 
అన్నీ అపస్వరాలే ... మొండి 
వాదనలే .... చీకటి తదుపరి 
వెలుగంటే .... నమ్మని తత్వం .... 

అడగక ముందే అన్నీ కావాలి 
కొరకముందే కోటి కనబడాలి 
శారీరక శ్రమలు ... మానసిక 
శ్రమలు లేకుండానే ....శాస్త్రజ్ఞుల 
కున్నంత సమ జ్ఞానం కావాలి...... 

పాలలో నెయ్యికి పరిశ్రమ 
కావాలి ....కాయ పండవాలంటే 
కాలం కలిసి రావాలి ..... 
ఇవేవి లేకుండానే మాకు 
ప్రత్యక్షమవాలి ...... 

నిశిరాత్రి ఒక గ్రామసింహం 
భౌ  మంటే.... ఎక్కడెక్కడో 
తచ్చాడేవన్నీ గొంతులు  కలుపు... 
మరి వాటికేం తెలుసో .... దొంగో… 
దొరో….. పశువులకున్నంత పాటి
గానిది…. 

విజ్ఞాన వంతులమని విర్రవీగే 
మానవాళి ఆలోచించాలి .... 
వినమ్రంగా వివరించాలి .... 
విశదంగా బోధించాలి ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment