కలల దీపం
తేది : 02-10-2021
శీర్షిక : మమతల చిరునామాగా ...
కవిత సంఖ్య : 171.
అక్షరాల తోవలో లక్షల
భావాలను చిలికి ...
విజ్ఞానాల తోటలో
వివేకాల .. వివేచనల
వెలుగుల్లో తచ్చాడాలని ...
కాలపు ప్రమిదలలో భావాల
వత్తులను వేసుకుని
కలల దీపాల కాంతిలో
కల కాలం బ్రతకాలని ....
స్వార్థాల సంకెళ్లను తెంచుకుని
మానవత్వపు బంధాలను
అల్లిబిల్లిగా అల్లుకుని
మమతల చిరునామాగా
మిగిలిపోవాలని .....
కలల దీపాల కాంతులను
కాగడాలుగా చేసుకుని
బ్రతుకు తోటను భవ్యంగా
మలుచుకుని... నిత్య కుసుమ
పరిమళాలను నిర్విఘ్నంగా
ఆఘ్రాణిస్తూ వనమాలిగా
సాగిపోవాలని సంకల్పించుకున్నా ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment