ఆ చల్లని సముద్రగర్భం
తేదీ 05-11-2021
శీర్షిక : బడబాగ్నులు
దాచుకున్న భాండాగారం
కవిత సంఖ్య : 791
మాటలు రాకున్నా మర్కటాలన్నీ
మూటీగా కలిసి బ్రతుకుతాయి ....
అక్షరాలు నేర్వకున్నా పక్షులన్నీ
ఆకాశంలో ఒక్కటిగా ఎగురుతాయి ....
ఆకారంలో పోలికలు లేకున్నా ...
అవతారంలో తేడాలున్నా ...వేళ్ళు
అన్నీ కలిసే ముద్ద నోట్లో పెట్టి
ఆకలి దప్పులు తీరుస్తాయి ......
అన్నింటా మిన్న అంటున్న
మానవుడు మాత్రం సాటివాన్ని
సదా తొక్కలనుకుంటాడు ...
ఆధిపత్యం చలాయించాలనుకుంటాడు
ప్రతి మనిషి మానసము
మల్లగుల్లాలు పడని
కోనేరో
అల్లకల్లోలాలెరుగని తటాకమో
అవుతే జగమంతా బృందావనమే .....
కానీ....
స్వార్థాలు చంకనెక్కినప్పుడు మాత్రం
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల
పైనెక్కి స్వారీ చేసి కళ్ళు మూసుకు పోయి
చెవులు బిగుసుకుపోయి ... పక్కవాణ్ణి కూడా
తొక్కేయాలని కోరుకుంటాడు ....
భరించేంత వరకు మోసి .... భారమైతే
మాత్రం ... చల్లని సముద్ర గర్భం లాంటి
మనిషి మానసం సైతం ... బడబాగ్నులు
దాచుకున్న భాండాగారంలా ... దావానలం
వెదజల్లి మదాంధకారులను మాడ్చి
మసి చేస్తుంది.... చల్లని సెలయేటి నీటిని
పంచేస్తుంది ...
అదేకోవలో మన కృష్ణమాచార్య గారు
నిజాము నిరంకుశాన్ని ...అక్షరాల
అంకుశంతో నిత్యం పక్కలో బల్లెమై ....
ప్రభవించిన మంకెన పూవై నిలిచాడు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment