ప్రత్యేక కవిత
on the occasion of
Daughter's day Spl.
Date: 26-09-2021
శీర్షిక : నాన్న కూచి
అవని మాతై మా ఇంట పుట్టెనా ...
మనుజాతికే మందిరయ్యే సుందరం
అల్లిబిల్లి మల్లె తీగ సుమమై విరిసెనా ....
అల్లారు ముద్దుగా గారాబములు పంచ
ఆట పాటలతోడ అలరించ మమ్ము....
నాన్న గుండెలమీద కునుకులు తీసి
నయాగారాల నవ్వులు పండించు
అమ్మ దగ్గర బుంగ మూతులు పెట్టినా
నాన్న రాగానే… రాగాలు తీసి గారాలు
పోవు....
అందియలు ఘల్లు ఘల్లుమనిపిస్తూ
ఇల్లంతా కలియ తిరుగు శ్రీమహాలక్ష్మి
ఆటాపాటల్లోనా అలసి సొలసినా
ఆదిలక్ష్మిలా ఎదురొచ్చే వేళ అంతా
శుభమే ...
కంటిలో కలక పడి.. కేక పెట్టినా
కన్న తల్లి మనసు కలవరిపడిపోవు
అరికాలుకు మట్టి అంటినా
అలమటించు నాన్న మనసు....
ఆడ పిల్లై... అత్తారింటికి పోయినా
అమ్మలా మమ్ము లాలించగలదు
నాన్నలా అందరిని మందలించి
తోబుట్టువులా ప్రేమించగలదు ....
అడిగినదే తడవుగా ... కొండనైనా
కొని తీసుకొచ్చే అమ్మానాన్నలు ...
ఆడపిల్లలెంత అమ్మానాన్నలిద్దరి కి
అపురూపమైనా.. నాన్న కూచిలై
నవ్వుతారు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment