Friday, November 5, 2021

ఆంక్షలు ... ఆకాంక్షలు తేదీ: 07-10-2021 శీర్షిక : గురువు ......

 ఆంక్షలు ... ఆకాంక్షలు

తేదీ: 07-10-2021
శీర్షిక : గురువు ...... 
కవిత సంఖ్య : 772 

అనుభవాల తోటలలో 
పండించుకున్న ఆలోచనల 
పంటలే ... ఆకాంక్షలకు మూల
బీజాలయి పురికొల్పుతున్నాయి .... 

నడిచొచ్చిన అడుగుల ఆనవాళ్ళేవో 
పారా హుశారంటూ ..... సైగలతో 
అక్షరీకరించుకున్న ఆంక్షల పుటలను 
తరిచి తరిచి చదవమంటోంది ...... 

సంప్రదాయాల సన్నజాజుల 
పందిరి నీడలో మనమంతా 
ప్రముఖులను  మహర్షులన్నాం ..... 
ప్రపంచమేమో ఈనాడు  వారినే 
శాస్త్రవేత్తలంటూంది .... 

వందలేండ్ల నాడే ఖగోళాన్ని  
కంఠస్థం చేసి ... విశ్వాన్ని 
విశదీకరించి.... వ్యవస్థీకృతంగా 
పలు రకాల మేలైన గ్రంథాలను 
మనకందించారు ....... 

ఆకాంక్షల పందిరిలో మనమూ 
అల్లుకు పోవాలంటే...జీవితమంతా 
ఆంక్షల గురువుల  అడుగుల్లోనే 
ప్రయాణించాల్సి ఉంటుంది ...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment