కందమూలాలు తిన్నప్పుడు...
కటిక రాతి గుహల్లో నిద్రించినా ...
అచ్చాదనలకై ఆకులలములు
అలంకరించి చుట్టుకున్నప్పుడు....
క్రూరమృగాల బారి నుండి ఒంటరై
మనకు మనం రక్షించుకున్నప్పుడు.....
నాగరికతలో నలుగురు కలిసి
నాలుగడుగులు వేసేలోపల ....
ఒకరికొకరు తోడున్నరనుకున్నా ...
అవిభాజ్యకుటుంబాల మరుగుతో ....
ఒంటరి తనమే ఆవరిస్తున్నందుకు ...
సాంకేతికతల సొబగులద్దుకున్నా ...
విశ్వమంతా వింతరీతిన
గుప్పిట బంధించామనుకున్నా
కాలుష్యాలను పెంచి పోషిస్తున్నందుకు...
జన సామాన్యుల మదిలో కలవరమే....
నింగినేగిరే పక్షుల బారు చూసినా
నీట మునిగి ఈదే చేపల గుంపు చూసినా
క్రమశిక్షణల కవాతులతో కంటికి
ఆనందమే ..... స్వీయ నియంత్రణలో
No comments:
Post a Comment