Friday, November 5, 2021

ఉషోదయ కిరణం తేది : 17-09-2021 శీర్షిక : చైతన్య మానసాలు

 ఉషోదయ కిరణం 

తేది : 17-09-2021
శీర్షిక :  చైతన్య మానసాలు 
కవిత సంఖ్య : 165

చీకటి దుప్పటి కప్పుకున్న రాతిరి ....
ఉషా కిరణాల రాకను పసిగట్టి 
పక్షుల  కిలకిలా రవముల హెచ్చరికలు 
జారీ చేయగానే మెల్లగా జారుకుంది .... 

ఉషోదయపు బంగారు కిరణాలు
ముద్దుముద్దుగా బయలుదేరి .... 
కొండా కోనా చెట్టు చేమ గొడ్డు గోదలను  
పక్షులను పలకరిస్తూ పల్లెలు పట్నాలను 
మేలుకొలుపుతాయి ..... 

పత్రహరితానికి పునాదులు వేసి
సతత హరితము వర్దిల్లజేస్తూ జీవకోటికి 
ఆయువు పట్టైన  ప్రాణవాయువులు 
ప్రత్యక్ష  పరోక్షాలుగా శాఖాహార మాంసాహార
ఆహారాలను అందిస్తుంది ….  

పచ్చ చీరకట్టుకున్న ప్రకృతమ్మ ఒడిలోని
గరకవనంలో కూడా దూరిపోయి …
నిశి చల్లదనాలలో మూటకట్టుకున్న 
ముత్యాల్లాంటి మంచు బిందువులను 
కూడా పలకరించి మాయం చేస్తాయి .... 

కిరణ రశ్మి వెలుగులు చిలకరించగానే.... 
నిశీధిలోమత్తుగా జోగిన ప్రతి అణువణువు 
వాగు వంక రాయి రప్ప పూవు కాయలను 
సృషిస్తూ  చైతన్య బాట పట్టిస్తాయి .... 

కాలమనే పుస్తకములో మరో కొత్త పేజీకి 
సమాయత్తం చేస్తూ గ్రంథరాజములో
తాను కూడా ఇమిడిపోతూ కిరణాలు 
జీవరాశికి బ్రతుకు బాటలు చూపిస్తాయి ...  

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment