Friday, November 5, 2021

రామప్ప కీర్తి పతాకం తేదీ: 12-09-2021

 రామప్ప కీర్తి పతాకం  

తేదీ: 12-09-2021

తేట తెల్లని మల్లె సుగంధం 
తెలంగాణా సాహిత్య కళాపీఠం 
అత్యధిక తెలుగు కవులను 
ఆహ్వానించిన విశ్వ వేదిక .... 

వరసపెట్టిరి వివిధ సాహిత్యాలు 
వింతైన వినోదాల పాటలతో  
ప్రాణమటువంటి పద్యాలతో 
గజల్  గీతాల గమ్మత్తులతో 
 
ఆధునికతల అడుగులతో 
సంతసాలు  సంతరించుకున్న 
అక్షర తూణీరాల వచన కవితల 
అన్ని రంగుల హంగుల మాలలతో ... 

అలంకరించిరి అమ్మ భాషలో 
అలనాటి ఆణిముత్యమైన 
శిల్ప సంపదల రామప్ప ఆలయపు 
ఘన కీర్తులను విశ్వమంతా చాటాగా.... 
అజరామరముగా  ఆ రామప్ప కీర్తి పతాకం 
 
నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment