చెలి సంబరం
తేదీ : 16-10-2021
శీర్షిక : వారి గమ్యానికి మన గమనం ....
కవిత సంఖ్య : 177
ఆత్మీయతలు నింపే అమ్మిల్లు
విడిచి వచ్చాననే విడి భావనలు
రాకుండా కంటికి రెప్పలా చూడ
గలగడమే కదా సంబరానికి మూలం .....
తోబుట్టువుల అనురాగాల మొలక
తొంబదామడైనా కదిలివస్తుంది ....
ఒక్క అడుగు ముందుకు వేసి
చేయందిస్తేనే కదా సంబరం ......
పుట్టిపెరిగిన తావులను వదిలి
కొంగొత్తగా అలవాట్లు మార్చుకుని
వచ్చినప్పుడు... అంది పుచ్చుకున్నట్టు
అరమరికలు లేకుండా చూసుకుంటేనే
కదా సంబరానికి మూలం .....
ఆడపిల్లనగానే ... అరికాలికి మట్టి
అంటకుంట చూసుకునే వారిని వదిలి
పిల్లి కరిచిన కోడిపిల్లలా బెరుకు బెరుకు
స్థితిని దాటించి కలుపుగోలుగా మాట
కలపడమే కదా సంబరానికి మూలం .....
అత్తింటివాళ్లంతా అడగక ముందే
అమర్చే అమ్మగా నిలవగలిగి ....
అన్నీ సర్దుకునే నాన్నలా మసలగలిగితేనే
కదా సంబరానికి మూలం ....
అప్రకటిత రహస్యాలను సైతం
పంచుకోగలిగే మృదు కవచమై
ప్రత్యక్ష పరోక్షాలలో ఉన్నతిని
కాంక్షించగలిగి... వారి గమ్యాలకు
మన గమనాలను జోడించగలిగితేనే
కదా చెలికి సంబరం ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment