కార్తీక మాసం
తేదీ : 01-11-2021
శీర్షిక : ఆచారం సంప్రదాయం సశాస్త్రీయం
కవిత సంఖ్య : 69+1
సృష్టి రహస్యాలను సున్నితంగా
కనుక్కొని .... సన్నిహితంగా
మార్చుకోవడంలో మనిషిని
మించిన వారు లేరంటే నమ్మండి .....
నిలవని కాల గమనాలను ...
గణనలు గావించి నిలుపుకుని ...
ఖచ్చితత్వముతో తార్కిక తత్వాలను
జోడించి అనుకూలతలు అలంకరించాడు ....
శంకలు లేక శరదృతువులో
లంకెలయ్యే కార్తీక మాసం
శివ కేశవులిరువురికి ప్రశస్తమే .....
పూజలందుకొనంగా ఘనముగా ......
స్థితి కారక కేశవ దామోదరం
లయకారక జటాజూట శివోహం
ఏకోన్ముఖులై జీవ జలాలను
ఆదుకునే మాసం కార్తీకం.....
ఉసిరి వనమూలికల ఉల్లాస వాసనలు
శ్వాసించిన కలుగు సౌభాగ్యమంటూ
వనభోజనాల వంతులేర్పరిచి
ఘన సంబరాల గమ్మత్తు తెలుపంగ .... .
ఆచారం సంప్రదాయం సమున్నతం
అన్నీ సశాస్త్రీయం... కలగలిసి న
హైందవం... నదీ స్నానం ఉపవాసం
దీప జ్వాల దానం....
కార్తీకమంటేనే దామోదర ప్రియమని.....
సకల జనులను
సన్నుతిస్తూ
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచిరి
సర్వ శ్రేష్ఠమని ప్రస్తుతించుతూ
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం.....
తరిగిన భాను సమయాలు
పెరిగిన నిశి అవధులు
మిలమిలల వెలుగులు విరజిమ్మి
మెరిసే నక్షత్రాలతో పోటీ పడే
జ్వాలా తోరణాలు ... శోభాయమానమే ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment