వాగ్దేవీ
తేది : 12-10-2021
శీర్షిక : వీణా పాణి
కవిత సంఖ్య : 175
వేదపురాణాలన్నీ ఉటంకించే...
మాటకు పాటకు చదువుకు రాతకు
బుద్ధికి వివేకం విజ్ఞానం కళలకు
కాణాచి శ్వేతాంబరధారి వాగ్దేవియేనని ....
కచ్చపి దారి కరుణా మూర్తి
మూల నక్షత్ర ముగ్ధ మోహనరూపే
హంస వాహినీ మహా మాయే
భాషా జ్యోతిర్మయి శుద్ధ స్పటిక రూపే ....
నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసిని
అంటూ కల్హణుడి కలములో జాలువారిన
అమ్మవారిని ఆది శంకరాచార్యులవారు
రామానుజులవారు ఆదరముగా దర్శించుకునె ....
అగస్త్యుడు కీర్తించిన అమ్మవారుగా
వ్యాసుడు ప్రతిష్టించిన జ్ఞాన సరస్వతీగా
శరన్నవరాత్రి ఉత్సవాలలో శక్తి రూపిణిగా
అమ్మను కొలిచే ఆరాధనా సూత్రం ......
సముద్ర గుప్తుని సువర్ణ నాణేలపై
ముద్రింపబడిన అమ్మవారు వీణలు ...
జైనుల షోడశ విద్యా దేవీగా కీర్తింపబడి
సర్వలోకాలను సద్గుణ సంపన్నుగా
నిలిపిన సరస్వతీ దేవి ...... నమో స్తుతే ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment