ప్రశ్నాంశము
తేది : 31-10-2021
శీర్షిక : విజ్ఞాన మార్గాలు
కవిత సంఖ్య : 185
పరిశీలనలు ఆలోచనలు వివేచనలు
ప్రగతి శీలనలే కాకుండా
ప్రశ్నించడం కూడా పలు
సమస్యలకు పరిష్కారమయ్యె ....
నాగరికతల అడుగులకు దారై
కొంగ్రొత్త ఆవిష్కరణల పూదోటలై
వింత వింత విజ్ఞానాల సముద్రంలో
నైపుణ్యతల పట్టము కట్టి ప్రఖ్యాతులను
గావించె .....
నిత్య బ్రతుకు బాటల తోటలలో సైతం
కష్టాల ముళ్ళను ఏరేస్తూ ... సంతోషాల
పూలను వశపరుచుకొని ... విజయ పరిమళాలను
ఆఘ్రాణించి .. బావుటాలెగరేసే
ఆలోచనలకు అంకురాలాయె ......
విజ్ఞాన ... వివేచన ... వివేక ....
బుద్ధి బలాల సమకూర్పులకు
నిజ నిర్ధారణ వేదికలకు ...
నిలువుటద్దమై జీవరాశినుండి
మనిషిని విడగొట్టి ఉన్నతంగా నిలిపింది.
అనుభవాల గురువుల ఆలంబనగా
ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలను
పరిష్కరించుకుంటూ .... నడకలు
సాగించి ..... సందేహాలు లేని భవిష్యత్తుకై
మనిషి పోరాటం ......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment