చిత్ర కవిత
తేదీ : 05-11-2021
శీర్షిక : అదృష్ట వంతుడు
కవిత సంఖ్య : 69+2
పచ్చ తివాచీ పరుచుకున్న
మరకత మైదానములో పర్యటిస్తున్న
మహిషమే మేరు సింహాసనంగా
పరుండిన పరువాల బాల్యం ...
సుఖ దుఃఖాల ఊసులెరుగని
సుందరమైన అమాయకత్వం
కష్ట నష్టాల బెరుకెరుగని
కాల మాన నింపాదుల తత్వం ....
బరువు బాధ్యతల బాదర
బందీలేదు... ఆలోచనలెరుగని
బంగారు బాల్యం... సుఖమెరగని
నిద్రకు ఎనుబోతే పానుపాయే .....
నిత్యం అభివృద్ధి మంత్రాలు జపించే
అధికార ప్రతిపక్ష పాలకులంతా
అంధులైపోతున్నారన్న దానికి
మచ్చుతునకే... అంగవస్త్రమెరుగని
అంగలార్చుకున్న ఈ బాల్యం .....
సేవల పేరు చెప్పి లక్షలు తీసుకుంటూ
వజ్రోత్సవాల వార్తలు అచ్చేసుకుని
మురిసే పాలకులు... అధికారానికి
ఊడిగం చేసే అధికారులు... మనసు
పెట్టి ఆలోచించాల్సిన తరుణం ఇది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment