Friday, November 5, 2021

చిత్రకవిత కవిత సంఖ్య: 120. సా స 10-05-2021

 కవిత సంఖ్య: 120. 


భరతముని బోధనల 
బంగారుమయమైన 
బంగిమల సంపత్తి 
శాస్త్రీయ నాట్యమై సల్లంగ 
వర్ధిల్లె చూడు వందలేండ్ల నుండి ..... 

కట్టు బొట్టు లోన కనికట్టు 
కట్టిపడేసు కద కలియుగాన్ని 
కనులలోన కనుబొమలలోన 
కదలాడు కమనీయ కాంతులు ... 

ముక్కున ముక్కెర లూగించి 
కర్ణమందు కుండలములు 
కరములందు గోరింట 
కాలియందు పారాణి 
తీర్చిదిద్దే కద తీరైన రూపం .....

కురులన్నియు ముడచి 
కుప్పెలుగ అలంకరించి 
జాలువారె జలధారలా 
జడ సర్వాలంకృతమై.... 

సంగీత ఝరిలోన హావ
భావ ఆంగిక ఆహార్యములు 
లయసంగమమయ్యేదే మన 
శాస్త్రీయ నాట్యమై వర్ధిల్లుచుండె .... 

శాతవాహనుల నాటి ఆరాధనలు
విజయనగరపు వీధుల ఆదరణలు
మిక్కిలి కలిగి నిలిచె చిక్కగ నేటికీ 
విశ్వమందు ఘనముగా వినుతికెక్క ..... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment