నేనున్నానని….
తేది : 10-11-2021
శీర్షిక : మల్లె పరిమళాలు ....
కవిత సంఖ్య : 794
రాతి గుహల్లోని నివాసం కాస్త
రంగు భవనాల్లోకి మారినది
నిశి చీకట్లలో ముళ్ల పొదల్లో
అడుగులేసిన అనుభవం నుండి
నియాన్ లైట్ల వెలుగుల్లో మెత్తటి
కార్పెట్ల పైన విహరిస్తున్నది... జీవితం .....
మొక్కను గదిలో ఉంచితే
మోడు బారినట్టే ... నాగరికతల
నడకల్లో నలుగురితో కలిసి
నడిచిన అడుగులు... కాస్తా ...
పారిశ్రామికీకరణలతో పరుగు
లంఘించుకుని ... పక్క వారిని
కూడా పట్టించుకోవడం
మానేసి మొరాయించింది ...
సాంకేతికత సొబగులద్దుకున్నాక
ఏకంగా జీవితాన్నే బందీ చేసుకుని
చిగుర్లు వేయకుండా....చింతల
నిండిపోతున్నది .....మానసం ....
పూలదండలోని దారంలా
కనిపించకపోయినా ఫరవా లేదు…
ఆత్మీయతానురాగాల అంకురాలతో
మనుషులను కలిపి ఉంచగలిగే
మనసుంటే చాలదా మల్లె పరిమళాల
సుగంధాలను మనుషులమధ్య కలిసి
పంచుకోవడానికి .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment