కలవరమాయే మదిలో
తేది: 16-09-2021
శీర్షిక : ఏ పుణ్యమో .....
కవిత సంఖ్య : 754
నేటి కవిత దృశ్య కవితాగానలహరిలో
నా శీర్షిక : ఏ పుణ్యమో…..
కంటి పాపలో కలల రాణిగా
బంధించుకున్నప్పటి నుండి
కలలో ... కలవరింతలో ... మెలకువలో ...
కదలాడే ప్రతి పనిలో నిత్యం ...
ప్రతి క్షణం నీ మననమే .....
నిరీక్షణలన్నీ నిజమైన వేళ .
నిలువెల్లా కితకితలైనా....
బ్రతుకు బాటలలో ....
బాధ్యతల బందీలో ... అడుగులు
బయటకు వేసే ప్రతి పూట
నీ మాటల పూదోటలే శ్వాసలాయే ....
ఒక్కొక్కసారి పని రాక్షసితో
కునుకు లేని కుస్తీల కలబడితే ....
మానసికంగా ... శారీరకంగా
అలసటల తోటలో అలమటించే
సమయాలలో .... మరుక్షణమే
నీ జ్ఞాపకాలే ప్రాణవాయువులై
పలకరిస్తాయి .....
తొలి చూపుల మాయలో ....
చిరునవ్వుల రువ్వులో ....
జీవితాన్నే పూల బాటలా మార్చి
కుసుమ పరిమళాలు వెదజల్లి
అలవోక అర్థ జీవితాన్ని దాటించింది ....
అమ్మా నాన్నల ఆశిస్సులో
ఆ దేవదేవుని వరమో .....
జన్మ జన్మల పుణ్య ఫలమో ....
ఇలా సాగితే చాలదా ఇకపై ....కూడా ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment