Friday, November 5, 2021

బాలు గారి వర్ధంతి ప్రత్యేక కవిత .... తేది: 25-09-2021 శీర్షిక : ఎస్ పి బి

 బాలు గారి వర్ధంతి 

           ప్రత్యేక కవిత .... 
తేది: 25-09-2021
శీర్షిక : ఎస్ పి బి 
కవిత సంఖ్య : 44+10

పండితారాధ్యుల వారి 
పసిడి కూన నీవయ్యా 
ఎస్ పి బాలుగానే 
ప్రాశస్త్యం  పొందావు 

మర్యాద రామన్నతో 
మాయ జేసినావయ్యా 
తెలుగువారి గుండెల్లో 
గుడి కట్టి నిలిపారు 

వెండి తెరల రాజువయ్యా 
దండి పాటల  దొరవయ్యా 
భాషేదైనా బలాదూరు నీకు 
భావాత్మక రాగం నీది సుమా 

పాడాలని ఉందంటూ 
స్వరాభిషేకాలే చేశావు 
పాడుతా తీయగా అని 
పదిమందిని తెచ్చావు 

మిథునంలో మెప్పించి 
విశ్వరూపం చూపావు 
లెక్కలేని పురస్కారాలు 
గొప్పగా దక్కించుకున్నవు 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment