Friday, November 5, 2021

సేద దీరనీ ఈ క్షణం తేది : 06-10-2021 శీర్షిక : అక్షరాలా తోటలో ఇప్పుడైనా .....

 సేద దీరనీ ఈ క్షణం

తేది : 06-10-2021
శీర్షిక : అక్షరాలా తోటలో ఇప్పుడైనా ..... 
కవిత సంఖ్య : 771

అవును ! సేద దీరనీ ఈ క్షణం 
ఇలా ... అడుగడుగున  పరుగుల 
బాటలు వదిలి .... లక్షల భావాలు 
పలికించే... అక్షరాలా తోటలో 
తలమునకలవుతూ ఇప్పుడైనా  .... 
బాదర బందీల చిక్కుముడులన్నీ 
పక్కన పెట్టేసి ..... చేరుకోలేక 
పోయిన సందార్భాలెన్నో..... 

బంగారు బాల్యపు తీపి జ్ఞాపకాల 
చెలిమెలు తోడుకొని... చెట్టు 
చేమలపై వాలిపోయిన పిట్టల్లా 
సెలయేటి  గట్టున పారాడిన 
పిచ్చుక గూళ్ళ ప్రతినిధుల్లా .... 
సంతోషాల వాకిళ్ళలో సరదా 
పడాలని ..... 

ఆకలైతే అమ్మలా మారి 
ఆపదొస్తే నాన్నలా మారి 
అల్లరికి తోబుట్టువయిన 
అప్రకటిత రహస్యాల నెలవై... 
నా గమ్యానికి తమ గమనం 
తోడు చేసిన మిత్రులతో .... 
కాసేపు సరదాగా గడపాలని ... 

విధి నిర్వాహణలో రాట్నంలా 
పరుగెత్తి ... పరుగెత్తి .... అలసిన 
మనసుకు .... విరామమిచ్చి 
నాదనుకునే వింత లోకంలో 
కొంత సేద దీరాలని..... 
ఆకతాయిగా అల్లరి చేస్తున్న 
మనసుకు ప్రశాంతత 
చేకూర్చాలని ....... 
ఎన్నో సార్లనుకున్నాను .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment